జల సంద్రంగా మారిన కరీంనగర్

రహదారుల మీదుగా వరద ప్రవాహం

దిశ దశ, కరీంనగర్:

స్మార్ట్ సిటీ కరీంనగర్ కాస్తా వాటర్ సిటీగా మారిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులన్ని కూడా వరద నీటితో నిండిపోయాయి. కలెక్టరేట్ రహదారి కూడా జలమయం అయిపోయి నగర వాసుల ముంగిట జలశయం ఏర్పడినట్టయింది. డ్రైనేజీ నీరు కూడా రోడ్లపైకి ప్రవహించడంతో పాటు, కొన్ని హోటళ్లలోకి కూడా నీరు వచ్చి చేరింది. వరద నీటితో చాలా వరకు ప్రధాన రహదారులు నిండిపోయాయి. దీంతో నగర వాసులు అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఓ హోటల్ లోకి రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు వచ్చి చేరడం విస్మయం కల్గిస్తోంది. 9వ డివిజన్ లోని ఎన్టీరామారావు విగ్రహం సెంటర్ తో పాటు బైపాస్ రోడ్డులోని ఎల్లమ్మ గుడి వద్ద కూడా నీరు రోడ్డు మీదుగా ప్రవహించడం గమనార్హం. మరో వైపున లోయర్ మానేరు డ్యాంకు దిగువన నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కరకట్టల కారణంగా వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. అలాగే ఎల్ఎండీ దిగువ ప్రాంతంలో కూడా నీరు నిలిచిపోయింది. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ సునీల్ రావు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

You cannot copy content of this page