ఒకప్పుడు కోడి కూత కూయగానే లేచే వాళ్ళు..కానీ ఇప్పుడు అలా కాదు.. టెక్నాలజి మారిపోయింది, అలారం పెట్టుకొని అది మోగిన తరవాత అలారం ఆఫ్ చేసి మళ్లీ నిద్రిస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు కూడా ఈజీగా మారుతున్నారు. కొంత మంది అయితే రాత్రి ఒంటి గంట , రెండింటి వరకు యూట్యూబ్ , ఇంస్టా గ్రామ్ రీల్స్ చూసుకుంటూ ఉండిపోతారు. ఇలాంటి వాళ్లు ఉదయం పూట పడుకొని ఆలస్యంగా లెగుస్తారు. వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఏ చిన్న శబ్దం వచ్చిన కోప పడుతుంటారు. వాళ్ల కోపాన్ని మనం కంట్రోల్ కూడా చేయలేము.ఇలా ఒకరని కాదు.. ఏంతో మంది ఇలాగే చేస్తున్నారు. ఇక్కడ ఈ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అసలేం జరిగిందంటే..
పడుకున్న మనిషి దగ్గరికి వెళ్లి ఒక కోడి పుంజు అరిచింది .. ఆ మనిషికి కోపం వచ్చి పుంజును కూర వండేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ వస్తుంది. ఆ వీడియోలో నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నం చేసింది.పదే పదే ఎగురులు పెట్టడంతో ఆ మనిషికి విసుగు వచ్చి చికెన్ కర్రీ చేసేసాడు.
ఈ వీడియోను Mirchi RJ Gordan అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 13 లక్షలు మంది చూశారు. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అయ్యో పాపం కోడి.. నేను ఐతే అలా చేసేవాడిని కాదంటూ నేను మంచిగా పెంచుకునే వాడిని కదా అంటూ ఇంకొందరు అయితే పాపం పుంజును చూస్తుంటే చాలా బాధ వేస్తుందంటూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.