ఒత్తైన జుట్టు కోసం.. కొబ్బరి పాల ప్యాక్ వేసేయండి..కొబ్బరి పాల వల్ల జుట్టు పొడవుగా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి పాలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. మీ జుట్టు స్ట్రాంగ్గా, సిల్కీగా మార్చే కొబ్బరి పాల హెయిర్ ప్యాక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పర్యావరణ మార్పులు, కాలుష్యం, చెడు ఆహార అలవాట్లు, పోషక లోపం.. అనేత ఇతర కారణాల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా హెయిర్
సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, నెరిసిపోవడం, పల్చగా అవ్వడం, డ్రైగా మారడం, చుండ్రు, జుట్టు జిడ్డుగా అవ్వడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. మార్కెట్లో లభించే అనేక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్.. అవి వాడితే జుట్టు సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. కానీ వాటితోనూ మంచి రిజల్ట్స్ రావు. మనకు సులభంగా దొరికే కొబ్బరి పాలు.. జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, ఇ క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, సహజ ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పాలు జుట్టు పొడవుగా, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి పాలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. మీ జుట్టు స్ట్రాంగ్గా, సిల్కీగా మార్చే కొబ్బరి పాల హెయిర్ ప్యాక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుని వేడి చేయండి. అవి గోరువెచ్చగా అయిన తర్వాత.. మాడుకు, జుట్టుకూ పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత షవర్ క్యాప్తో జుట్టును కవర్ చేయండి. . ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో.. తలస్నానం చేయండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టు మెత్తని పట్టు కుచ్చులా అవుతుంది. జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది.
కొబ్బరి పాలు, పెరుగు ప్యాక్
కొబ్బరి పాలు – 5 టేబుల్ స్పూన్లు
పెరుగు – 1 టేబుల్ స్పూన్
కర్పూరం – పావు టీస్పూన్
ఈ మూడు ఒక గిన్నెలో తీసుకుని మిక్స్ చేయండి. దీన్ని జుట్టు కదుళ్ల నుంచి, చివర్ల వరకు అప్లై చేయండి. దీన్ని ఒక గంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్.. జుట్టు మెరిసేలా చేస్తాయి. హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తాయి. కర్పూరం చుండ్రు, పేను, దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.