ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన దశాబ్దాలుగా హైదరబాద్ లో స్థిరపడ్డారు. ఆయన తండ్రి అమర్ నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య సీఎం బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 సెప్టెంబర్ 25 నుడి 2014 ఫిబ్రవరి 19 వరకు కిరణ్ కుమార్ రెడ్డి పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి పూర్వాశ్రమంలోనే చేరారు. తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా ఆయనతో బీజేపీ జాతీయ నాయకత్వం టచ్ లో ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆయన అనచరురులు కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రకనట చేయలేదు. కానీ అనూహ్యంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఆమెదించాలని ఏఐసీసీ అధ్యక్షునికి లేఖ రాశారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post