ఠాణా మెట్లెక్కిన మాజీ కలెక్టర్

ఎస్సైపై ఫిర్యాదులో సాక్షి

చెక్క బెంచిమీద కూర్చున్న ఈయన ఎవరో తెలుసా..? జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి. దళితులపై జరుగుతున్న వివక్షను కళ్లారా చూస్తూ రాజీ పడలేక రాజీనామా చేసిన అధికారి. ఆ మాజీ కలెక్టర్ ఠాణా మెట్లెక్కారు. ఏకంగా ఓ పోలీస్ అధికారిపై పిటిషన్ ఇప్పించి ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. తెలంగాణలో సంచలనం కల్గించిన ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.

ఏం జరిగిందంటే…

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించే పనిలో పోలీసులకు నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో భూపాలపల్లి స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ రామకృష్ణ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఓ డ్రైవర్ ను కొడుతున్న సమయంలో అటుగా వెల్తున్న ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గమనించారు. అంతే తన వాహనంలోంచి దిగి ఎస్సై చర్యలను అడ్డుకున్నారు. డ్రైవర్ ను కొట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. బాధితుడికి ఎస్సైచే సారీ చెప్పించి నేరుగా స్టేషన్ కు వెల్లారు.

సాక్షిగా…

ఎస్సై రామకృష్ణ డ్రైవర్ ను కొట్టాడంటూ బాధితుడు బిక్షపతిచే భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. స్టేషన్ కు వెల్లిన మాజీ కలెక్టర్ ఆకునూరి మురళీ పోలీసు అధికారి వచ్చే వరకూ స్టేషన్ లో బెంచిపై కూర్చిన వచ్చిన తరువాత దరఖాస్తు ఇప్పించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సాక్షిని తానేనంటూ అదే పిటిషన్ లో ఆకునూరి మురళీ రాయించి ఇవ్వడం గమనార్హం. శాంతి భద్రతలు పరిక్షించేందుకు డ్యూటీ చేస్తున్న స్టేషన్ లోనే ఎస్సై రామకృష్ణపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై పోలీసు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్నదే హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page