మాజీ ఐఏఎస్ అధికారి ఆందోళన…

అప్పటి పని ఇప్పటికైనా పూర్తి చేయాలి: ఆకునూరు మురళి

ఒకప్పుడు ఆ జిల్లాకు బాస్ గా వ్యవహరించిన ఆఫీసు ముందే ఆ అధికారి ఆందోళన చేశారు. జిల్లాను ఒంటి చేత్తో నడిపించిన ఆయనే నేడు అదే చేయి ఎత్తి నినదించారు. తన హయాంలో ప్రారంభం అయిన వాటిని నేటికీ లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏకంగా ఐధు కిలోమీటర్ల మేర కాలినడకన వెల్లి ఆ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సన్నివేశం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సాక్షాత్కరించడం విచిత్రం

ఆందోళనకు కారణం..?

భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ ఇండ్లు నేటికీ పేదలకు పంచలేదన్న కారణంతో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలో ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ కలెక్టరేట్ ముందు నిరసన ఆందోళన చేశారు. వెంటనే డబుల్ ఇళ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఆకునూరి మురళీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి వెంటనే డబుల్ ఇండ్లను పంచిపెట్టాలని కోరారు. భూపాలపల్లి కలెక్టర్ భ్రవేష్ మిశ్రా సంక్రాంతి లోగా అర్హులైన వారికి డబుల్ ఇండ్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారని ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ట్విట్ చేశారు. ఒకప్పుడు అదే కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ను అందించిన ఆకునూరి మురళీ నేడు అదే ఆపీసు ముందే ఆందోళన చేసి వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. అదీ ఆయన కలెక్టర్ బాధ్యతల్లో ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఈ ధర్నా చేయడం విశేషం.

https://twitter.com/Murali_IASretd/status/1611395815356137473?t=cBPk1Rnz9GIeJPdlBfAmMg&s=08

You cannot copy content of this page