దిశ దశ, జాతీయం:
బీజేపీ మూడో లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ తాజా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది బీజీపీ అధిష్టానం. చెన్నై సౌత్ లోకసభ స్థానం నుండి ఆమె పోటీ చేయనున్నారు. తమిళనాడు నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్న తమిళిసై రెండు రోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఆమెకు చెన్నై సౌత్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించింది అధిష్టానం.
