పొన్నం’ వద్దకు క్యూ కడుతున్న గంగుల ఫ్యామిలీ…

‘దిశ దశ, కరీంనగర్:

మాజీ మంత్రి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా తాజా మంత్రి వద్దకు వెల్లి కలుస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాలను కూడా పట్టి కుదిపేస్తున్న ఈ చర్యల వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఎడమొఖం పెడ మొఖంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నాయకుల కేంద్రీకృతంగా సాగుతున్న చర్యలపై హాట్ టాపిక్ గా మారింది.

మొన్న బావ… నిన్న అన్న…

మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ లు ఇద్దరు కూడా ఒకే రోజు జన్మించారు… ఇద్దరి మధ్య కూడా అత్యంత చనువు కూడా ఉంది. రాజకీయాల్లో సీనియర్ అయిన పొన్నం, ఆయన తరువాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన గంగుల కమలాకర్ లు ఒకే సారి చట్ట సభలకు ఎన్నికయ్యారు. పొన్నం ప్రభాకర్ లోకసభకు ఎన్నికైతే, గంగుల ఎమ్మెల్యేగా శాసన సభలోకి అడుగు పెట్టారు. అయితే వీరిద్దరి మధ్య కూడా చాలా కాలంగా సాన్నిహిత్యం నెలకొని ఉండడంతో ప్రాణ స్నేహితులు అన్న ప్రచారం కరీంనగర్ అంతా వ్యాపించింది. అయితే స్వరాష్ట్ర కల సాకరం అయిన తరువాత జరిగిన పరిణామాల్లో పొన్నం, గంగుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నం ప్రభాకర్ కు పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు క్యాడర్ కూడా అనుకూలించకపోవడంతో ఓ సారి ఎంపీగా, ఓ సారి ఎమ్మెల్యేగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ తరువాత నెలకొన్న రాజకీయ పరిణామాలు కాస్తా పొన్నం, గంగుల మధ్య అంతరాన్ని ఏర్పర్చాయి. వీరిద్దరి మధ్య మాటల యుద్దం కూడా తీవ్ర స్థాయిలోనే సాగగా, వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే కరీంనగర్ రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు వ్యూహాత్మకంగా ఎత్తులు పై ఎత్తులు వేశారని, ఇందుల గంగుల హస్తం కూడా ఉందని పొన్నం ప్రభాకర్ వర్గం బలంగా విశ్వసించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకోవడం అక్కడి నుండి గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చాలామంది బీఆర్ఎస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ను సంప్రదించినా కూడా ఆయన ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు లేని నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండడంతో గంగుల అనుచరుల్లో కొంతమంది అయోమయమైన పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పొన్నం ప్రభాకర్ ను కలిసేందుకు గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. రెండు రో్జుల క్రితం గంగుల బావ, గ్రానైట్ ప్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ వెల్లి కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా గంగుల కమలాకర్ అన్న గంగుల సుధాకర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెల్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టయింది. ఇంతకాలం పొన్నం ప్రభాకర్ అంటేనే అంటీముట్టనట్టుగా వ్యవహరించిన గంగుల కుటుంబం ఈ రోజు అకస్మాత్తుగా ఆయన్ని కలిసి అభినందనలు తెలుపుతున్న తీరు సంచలనంగా మారింది. వ్యాపార పరంగా పొన్నం ప్రభాకర్ ను కలుస్తున్నారే తప్ప మరోటి లేదన్న వాదనలు తీసుకొస్తున్నప్పటికీ ఇంతకాలం ఆయన వైపు కన్నెత్తి చూడలేదు కదా ఈ రోజు ఎందుకు కలుస్తున్నారన్నదే అంతుచిక్కడం లేదని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అయితే గంగుల సుధాకర్ గతంలోనే మంత్రి పొన్నం కలిశారని… తాజాగా ఈ ఫోటో వైరల్ అవుతుండడం గమనార్హం.

You cannot copy content of this page