కవిత సీఎం కావాలనుకుంటోంది… కల్వకుంట్ల కుటుంబంపై ‘గోనె’’ ఫైర్…

దిశ దశ, కరీంనగర్:

కల్వకుంట్ల కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు వదిలపెట్టడం లేదు. అధికారంలో లేకపోయిన వారి కుటుంబ సభ్యుల తీరును ఏకి పారేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో దూకుడు ప్రదర్శించిన ఆయన ఇప్పుడు కూడా అదే రీతిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనయ కవిత టార్గెట్ గా ఘాటైన వ్యాఖ్యలు సంధించారు. బీసీల గురించి కవిత మాట్లాడడం ఏంటని వారిపై ఈ రోజు ప్రమే పుట్టుకొచ్చిందా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను వివక్షకు గురి చేసిన వారిప్పుడు ఆ నినాదం ఎత్తుకోవడం ఏంటని ప్రశ్నించారు. శాసనసభలో కేటీఆర్, హరిష్ రావులు మాత్రమే మాట్లాడుతున్నారని, మండలిలో కవిత ప్రసంగిస్తున్నారన్నారు. అయితే రెండు సభల్లో ఏక్ సే ఏక్ బీసీ లీడర్లు ఉన్నప్పటికీ వారికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదని, కేటీఆర్, హరీష్, కవితలు మాత్రమే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించి ఇప్పుడు ఆ పల్లవి ఎత్తుకోవడం విచిత్రంగా ఉందని గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించినప్పటికీ దామాషా ప్రకారం మాత్రం ఆయా సామాజిక వర్గాలకు క్యాబినెట్ లో అవకాశం కల్పించలేదని గుర్తు చేశారు.

జ్యోతిష్యుడు చెప్పాడనే…

జైలుకు వెల్లి వచ్చిన వారంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారని, కవితకు కూడా సీఎం అయ్యే యోగం ఉందని జ్యోతిష్యుడు చెప్పింనందు వల్లే కవిత బీసీ నినాదం ఎత్తుకుందని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో కవిత కూడా సీఎం కావాలని అనుకుంటోందని, కేటీఆర్ కు ఆమె పోటీగా మారిందని వ్యాఖ్యానించిన ఆయన మహిళా బిల్లు పోరాటం గురించి కూడా విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేశారని, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

గోనె ప్రకాష్ రావు కామెంట్స్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి


You cannot copy content of this page