బీసీలకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన
దిశ దశ, జనగామ:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అనుబంధం పెనవేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో జరుతున్న వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతున్నదని, బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎంతో గుర్తింపు లభిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కీలక పదవుల్లో పనిచేసిన వారితో కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబందం పెనవేసుకున్న తాను అమెరికాలో ఇంజనీర్ గా స్థిరపడగా, పీవి నరసింహరావు స్పూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. దారుణమైన పరిస్థిలో అనుమానాలు భరిస్తూ మనుగడ సాధించలేమన్న ఆవేదనతో తాను పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నానని పొన్నాల లక్ష్మయ్య ఆలేఖలో వెల్లడించారు. తనకు పదవులు ఇచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యావాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్య రాసిన లేఖ పూర్తి పాఠం
శ్రీ మల్లికార్జున ఖర్గే. ఏఐసీసీ అధ్యక్షులు గారికి నమస్కారం..
అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్ గా పనిచే అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు గారిపిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన నేను కాంగ్రెస్ పార్టీని క్రియాశీల కార్యకర్తగా చేరాను. సుమారు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షులవరకు అనేకమైన కీలక పదవులను నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేయ డం కాంగ్రెస్ పార్టీలోనాకు అత్యంత ఆనందమైన రాజకీయ జీవితంలో చెప్పుకున్నాను. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నన్ను తీవ్రంగా కలిసివేస్తున్నాయి. నన్ను అధ్యక్ష పద నుండి ఆకారణంగా తొలగించిన తర్వాత ఇప్పటివరకు దాదాపు తొమ్మిది ఏళ్లు ఏలాంటి పదవి ఇవ్వ కున్న అనేక మాధ్యమాల ద్వారా నా గళం విప్పాను. 2014లో పార్టీ ఓటమిపాలైంది అయిన తెలంగాణ ఓటమికి నేను కారణమని నన్ను బలి చేశారు. అదే 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధిచెందుకున్న కూడా ఆనాటి నాయకత్వం పై చర్యలు తీస్కోకపోగా అదనంగా పదవులు ఇచ్చా రు. నేను పార్టీ సిద్ధాంతాల ప్రచారం, బడుగు బలహీన వర్గాలు అంశాలను ఎత్తిచూపడం, పార్టీబలోపేతానికి నా వంతుగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాను. ఎంతమంది ఎన్ని రకాలుగా నాపై మాట్లాడిన నేను పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. కానీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ మూలసిద్ధాంతానికి పూర్తి భిన్నంగా వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతూ కాంగ్రెస్ పార్టీ భూమిపుత్రులుగా ఉన్న మాలాంటి వారిని అవమాన పరుస్తూ కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వే అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు పార్టీలో పరాయివాడిగా మారిపోయి ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది. నేను గత రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పిసిసి అధ్యక్షుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు అపా ట్మెంట్ కోరడం జరిగింది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా బయట ఎక్కడైనా కలిసిన కనీసం సమస్కారం పెడితే మాట్లాడకుం డా చూడకుండాఅవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదు. ప్రధానంగా నా వ్యక్తి గత అంశాలు పక్క న పెడితే కాంగ్రెస్ మూల సిద్దంతమైన సామాజిక న్యాయంఇప్పుడు పాతరేయబడింది. సమాజంలో 50 శాతం పైగా ఉన్న బిసిల పట్ల ఇ కడ అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అగిడితే కనీసం చర్చించిన సందర్భాలు లేవు. బీసీలకు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తూ సీట్లను ఎగ్గొట్టి మీరుఓడిపోయే అభ్యర్థులు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. పార్టీ లో లేని వ్యక్తు లు గెలుస్తారు అంటూ వారికి టికెట్స్ కేటాయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూస్తున్నది. నాలాంటి ఒక సీనియర్నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాంటిమెంట్ కోసం వేచిచూడడంఒక దుర దృష్టకర పరిణామం. నేను ఢిల్లీకి వచ్చి 10 రోజులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసివేణుగోపాల్ గారిని కలుద్దాం అంటే కనీసం ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు ఢిల్లీకి బీసీ టీమ్ నాయకులు 50 మంది వెళితేఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరం. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీక… ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్ర నాయకుల చుట్టూ బీసీ తిరిగితే పార్టీ పరువు పోతుంది. నేను 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి.. తెలంగాణ కోసం నేను మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పనిచేసాను. రాష్ట్రంలో 12 ఏళ్ళు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాను పార్టీలో అనేక పదవులను అత్యంత నిబద్ధతగా, క్రియాశీలకంగా, పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన నాకే ఇంత అవమానం జరిగితే పార్టీ లో సగటు బీసీ నేతపరిస్థితి ఊహిస్తేనే భయం అవుతుంది. ఎవరో డబ్బులు ఇచ్చారని బీసీ నాయకులు పనికిరారు. వాళ్ళు ఓడిపోయే వాళ్ళు అంటూ టికెట్లు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వా రికి, డబ్బులు, భూములు, పిల్లలు, బంగారం ఇచ్చిన వారికిటికెట్లు ఇస్తూ పార్టీ ని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తుందని చెపుతూ పార్టీ ని అమ్మకానికి పెట్టి ఒక ఒక వ్యాపార వస్తువుగా మార్చి వేశారు. కాంగ్రెస్పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్ళు పార్టీకి బజార్లో గొడ్లను అమ్మినట్టుపార్టీ టికెట్లను అమ్మకుంటున్నారు. పార్టీ లో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవైపు అధికార బి అర్ఎస్ పార్టీలో చిన్న చిన్న బీసీ కూలలను కూడా గుర్తించివారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పోరేషన్ పడవులు పార్టీ పదవులు ఇస్తుంటే మన దగ్గర పార్టీ లో పీసీసీ అధ్యక్ష పదవులు నిర్వహించిన వారికి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా కనీసం మాట్లాడేందుకు అగ్ర నాయకులు కలవకపోవడం తెలంగాణ సమాజంలో కాంగ్రేస్సేసీ నాయకుల పట్ల చాలా చిన్న చూపుగా మారింది. పార్టీ లో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటాం ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ ప్రకటనలు ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్ రవి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారినిగుండెల్లో పెట్టుకుంటాం అన్నారు. కొత్తగా వచ్చిన వారు 5 ఏళ్ళు పార్టీలో పని చేస్తేనే పదవులు అన్నారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు. డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ నేడు పార్టీ లో జాయిన్ కాకమాండే టికెట్లను అమ్మకుంటున్నారు. ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ, సర్వేలలో మీ పేరు లేదు అంటూఒక అనామకుడు చెప్పింది వింటూ పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి. లో పార్టీలో అవమానాలు భరిస్తూ మనుగడ సాదించలేమన్న ఆవేదనతో నేను పార్టీతో నాకు ఉన్నఅనుబంధాన్ని తెంచుకోవాలని అను కుంటున్నాను. ఇంతకాలం పార్టీలో నాకు పదవులు ఇచ్చిఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.