నాలుగు దశాబ్దాల క్రితం…

నాలుగు దశాబ్దాల క్రితం ఆయన ఆ క్షేత్రానికి తన కుటుంబ సభ్యులతో వచ్చారు. ఆలయ పరిసరాల్లోని బండరాళ్లపై కూర్చుని చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నారు. అప్పటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పుడు సాధారన భక్తుడిలా వచ్చిన ఆయన నేడు అత్యంత ప్రాముఖ్యత కల్గిన ప్రజా ప్రతినిధిగా రావడం గమనార్హం.



కొండగట్టు వేదికగా…


కొండగట్టు అంజన్న సన్నిధిలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుందనే చెప్పాలి. 40 ఏళ్ల క్రితం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఫ్యామిలీతో కలిసి అంజన్న దర్శనానికి వచ్చారు. అప్పుడు పిల్లలతో ఆడుకుంటున్నప్పటి ఫోటోలు బుధవారం నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో అంజన్న సన్నిధికి చేరుకుని ఆలయ అభివృద్ది కోసం నిధుల వరద పారించడం విశేషం. ఆలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు ఏరియల్ సర్వే కూడా నిర్వహించిన కేసీఆర్ అంజన్న ఆలయ అభివృద్ది కోసం రూ. 600 కోట్లు కెటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే నాలుగు దశాబ్దాల క్రితం ఫోటోలు వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page