అరన్‌పూర్ బ్లాస్టింగ్ లో మిలిషీయా సభ్యుల అరెస్ట్

ముగ్గురు మైనర్లూ అరెస్ట్

దిశ దశ, దండకారణ్యం:

దంతెవాడ జిల్లా అరన్‌పూర్ మందుపాతర పేళుడు ఘటనపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెడ్కా చౌక్ సమీపంలో జరిగిన ఈ బ్లాస్టింగ్ ఘటనలో భాగస్వామ్యం ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు దంతెవాడ జిల్లా పోలీసులు. ఈ ఘటనపై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లా అరన్‌పూర్ సమీపంలోని పెడ్కా చౌక్ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంగతి తెలిసిందే. పోలీసు బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేయడంతో 10మంది డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు దర్భా ఏరియా మలంగీర్ ఏరియా కమివటీ మిలీషియా సభ్యులు బుద్ర మార్వి, జితేంద్ర ముచకిచ హిద్మా మార్కం, హిద్మా మార్విలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా వీరికి కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టు దంతెవాడ ఎస్సీ సిద్దార్థ్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు.

మందుపాతరలో మైనర్లూ..!

అరన్‌పూర్ బ్లాస్టింగ్ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కొత్త విషయాలను కూడా గుర్తించారు. ఈ మందుపాతర పేల్చివేతలో ముగ్గురు మైనర్లు కూడా భాగస్వాములు అయ్యారని ఎస్పీ సిద్దార్ధ్ తివారి వివరించారు. ఇప్పటివరకు దండకారణ్య అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చివేత ఘటనలో మేజర్ల పాత్రే క్రియాశీలకంగా ఉండేది కానీ తాజాగా జరిగిన పెడ్కా చౌక్ ఘటనలో మైనర్ల పాత్ర కూడా వెలుగులోకి రావడం గమనార్హం. బాలల సంఘం ద్వారా మావోయిస్టులు రిక్రూట్ మెంట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే అయినప్పటికీ ఇలాంటి ప్రధానమైన ఘటనల్లో మాత్రం మైనర్ల పాత్ర వెలుగులోకి రాలేదు. అరన్‌పూర్ బ్లాస్గింగ్ ఇన్వెస్టిగేషన్ విషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు మైనర్లను కూడా అదుపులోకి తీసుకోవడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. వీరిని చైల్డ్ ఇంప్రూవ్‌మెంట్ హోమ్‌కు పంపించినట్టు ఎస్సీ వివరించారు. ఈ బ్లాస్టింగ్ ఘటనకు సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం సేకరించామని, ఈ అంశంపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడే బయటకు చెప్పలేమని, తాము చేపట్టే దర్యాప్తుకు ఆటంకం కల్గే అవకాశం ఉన్నందున పూర్తి వివరాలు సేకరించిన తరువాత వెల్లడిస్తామని చెప్పారు. పెడ్కా చౌక్ ఏరియాలో ఇంటెన్సివ్ పెట్రోలింగ్ చేపట్టామని మందుపాతర ఘటనతో సంబంధం ఉన్నవారిని గుర్తించి వారి గురించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు దంతెవాడ ఎస్సీ సిద్దార్థ్ తివారి వివరించారు.

You cannot copy content of this page