దిశ దశ, ఆసిఫాబాద్:
అప్పటి వరకూ హోలీ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్న ఆ గ్రామస్థులంతా విషాదంలో కూరుకపోయారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టిన వారి రోధనలతో దద్దరిల్లిపోయింది. వార్దానదిలో స్నానం చేసేందుకు వెళ్ళిన నలుగురు యువకులు గల్లంతు కావడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటివపల్లి వద్ద నలుగురు యువకులు సోమవారం మద్యాహ్నం వార్దానదిలో స్నానం చేసేందుకు దిగారు. నీటి గుంతల్లో చిక్కుకున్న ఆ నలుగురు కూడా గల్లంతు అయ్యారు. వార్దానదిలో గల్లంతైన వారు నదిమాబాద్ కు చెందిన సంతోష్ (25), ప్రవీణ్ (23), కమలాకర్ (22), సాయి (22)లుగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతయిన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.