దిశ దశ, కరీంనగర్:
సివిల్స్ కు ఎంపికై దేశానికి సేవ చేయాలనుకున్న ఆయన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. తెలుగు భాషలో చదువుకోవడమే ఇందుక కారణమని తన లోపాన్ని గుర్తించారు. ఈ పరిస్థితి భవిష్యత్తు తరాలకు రాకుండా ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన ఆయన సివిల్స్ వైపు అడుగులు వేసే యువతకు దిశా నిర్దేశం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. డిగ్రీ చదివే విద్యార్థులకు ఐఏఎస్ ఫౌండేషన్ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు నారోజు శంకరాచారి. శుక్రవారం స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సివిల్ సర్విసెస్ ప్రిపేర్ అయ్యే వారికి జనరల్ స్టడీస్ పై ఉచిత శిక్షణ ఇస్తామని శంకరాచారి తెలిపారు. ఔత్సాహికులు 9441808065 నంబర్ లో సంప్రదించాలని ఆయన సూచించారు. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారిని తనవంతు బాధ్యతగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు ఎదురైన అనుభవాలను పాఠాలుగా మలచి ఈ తరం విద్యార్థులకు నేర్పించినట్టయితే వారు సుశిక్షుతులుగా తయారవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు శంకరాచారి.