పెద్దపల్లి మార్కెట్ లో ఉచితంగా వెజిటేబుల్స్: ఇదో రకం నిరసన

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రజలకు వెజిటేబుల్స్ రెండు రోజులుగా ఫ్రీగా ఇస్తున్నారు.

హోల్ సేల్ వర్సెస్ రిటేల్…

హోల్ సేల్ వ్యాపారుల తీరుకు నిరసనగా రిటేల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రెండు రోజులుగా తమ నిరసనను తెలుపుతున్నారు. మార్కెట్ లోని హోల్ సేల్ వ్యాపారులు రిటేల్ వ్యాపారులకు విక్రయించే ధరకే సాధారణ ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని రిటేల్ వ్యాపారులు వాపోతున్నారు. హోల్ సేల్ వ్యాపారులు వెజిటేబుల్స్ ను తక్కువ ధరకు తమకు విక్రయిస్తే తాము గిట్టుబాటు ధరలకు విక్రయిచే వారమని అయితే హోల్ సేల్ వ్యాపారులు కూడా తక్కువ ధరకే కూరగాయాలు అమ్ముతుండడంతో తమ వద్ద ఎవరూ కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. గతంలో ఈ విషయంపై అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రిటేల్ వ్యాపారుల సంఘ ప్రతినిధులు అంటున్నారు. చాలా కాలంగా కూరగాయల అమ్మకంపై ఆధారపడి జీవిస్తున్న తమకు హోల్ సేల్ వ్యాపారుల తీరుతో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారుల వైఖరిలో మార్పు వచ్చే వరకు కూడా తాము ఉచితంగానే కూరగాయలు పంఫిణీ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని రిటేల్ కూరగాయల వ్యాపారులు కోరుతున్నారు.

You cannot copy content of this page