ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే హంగామా

జ్యోతిష్మతిలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్

దిశ దశ, మానకొండూరు:

ప్రామాణికతలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జ్యోతిష్మతి విద్యాసంస్థల ఛైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. విద్యార్థులను సుశిక్షుతులగా తీర్చిదిద్దడంపై తమ సంస్థలో పనిచేసే ఫ్యాకల్టీ నిర్విరామంగా కృషి చేస్తోందని వివరించారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ… తమ కళాశాలకు అటానమస్ హోదా దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. సీట్ల కోసం వెంపర్లాడకుండా కేవలం నాణ్యమైన విద్య అందించడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునేలా విద్యార్థులను తయారు చేస్తున్నామని, సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న జ్యోతిష్మతి మహా ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగామన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన చేస్తున్నందు వల్లే న్యాక్ ఏ గ్రేడ్ సాధించామన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో తమ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే తమ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపక బృందం అందిస్తున్న సేవలకు తార్కాణమన్నారు. ధన సమముపార్జనే ధ్యేయంగా పెట్టుకుని విద్యాబోధన చేయడం సరికాదని సాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఈఈఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్ బ్రాంచులకు చెందిన ఒక్కో విద్యార్థికి రూ. 25 వేల స్టైఫండ్ చెక్కులను అందించారు. కళాశాల సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి మాట్లాడుతూ.. ప్లేస్మెంట్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీ తో ఉద్యోగాలు పొందారని, మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులో ఉందని వివరించారు. కళాశాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఐఐటి, ఎన్ఐటిలలో పని చేస్తున్న ప్రొఫెసర్ల చేత నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థులకు గణనీయమైన మేలు చేకూరుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఎస్.రావు, డీన్ డాక్టర్ పీ.కే వైశాలి, హెచ్వోడీలు, సీనియర్ ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్టైఫండ్ అందిస్తున్న జ్యోతిష్మతి ఛైర్మన్ సాగర్ రావు

You cannot copy content of this page