ఎనిమిదేళ్ల బాలుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

దిశ దశ, జాతీయం:

ఎనిమిది సంవత్సరాల చిన్నారి మృత్యువాత పడడంతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. దేశంలోనే అతి పిన్న వయసులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగింది కూడా ఆయనకే కావచ్చు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతోనే ఈ విధానం సాధ్యమైంది. అయితే అర్థంతరంగా తనువు చాలిస్తున్న వారి అవయవాలను దానం చేసిన వారికి అధికారిక లాంఛనాలతో చివరి మజిలీ పూర్తి చేస్తామని గత నెలలో ఆయన ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలకు గురయినప్పుడు కానీ ఇతరాత్ర సమయాల్లో కానీ బ్రెయిన్ డెడ్ అయి అపస్మారక స్థితికి చేరుకుంటున్న వారి ఆర్గాన్స్ దానం చేసినట్టయితే వాటిని ఇతరులకు ఉపయోగించడం వల్ల ప్రాణదాతలుగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అంతగా అవగాహన లేని చాలా మంది కూడా కోమాలో ఉన్న వారు మరణించిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన వారికి కోమాలో ఉన్న వారి అవయవాలను దానం చేయాలన్న విషయంపై చైతన్యం నింపాలని పలువురు పిలుపునిస్తున్నారు. కానీ ఇందుకు అనుగుణంగా స్పందన మాత్రం రావడం లేదు. దీంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అపస్మారక స్థితికి చేరుకున్న వారి ఆర్గాన్స్ డొనేట్ చేసినట్టయితే వారి అంత్యక్రియలు అధికారికంగా చేస్తామని ప్రకటించడంతో పాటు రూ. 5 లక్షల సాయం కూడా అందిస్తామని ప్రకటించారు. నవీన్ పట్నాయక్ పిలుపును అందుకున్న ఓ తండ్రి రెండో తరగతి చవువుతున్న తన ఎనిమిదేళ్ల చిన్నారి అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన సుభాజిత్ సాహూ పరీక్షకు హాజరవుతున్న క్రమంలో అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సుభాజిత్ తిరిగి కోలుకునే పరిస్థితి లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో అతని తండ్రి బిశ్వజిత్ సాహు ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు తిరిగి రాని లోకాలకు చేరుకుంటున్నాడని కనీసం అతని ఆర్గాన్స్ అయినా పదిమందికి ఉపయోగపడతాయని భావించి వాటిని డోనేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సుభాజిత్ మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, కళ్ళు, గుండె మరియు ప్యాంక్రియాస్‌తో సహా అన్ని అవయవాలను దానం చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం భవనేశ్వర్ లోని సత్యనగర్ శ్మశాన వాటికలో సుభాజిత్ సాహూ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు.

You cannot copy content of this page