దిశ దశ, మహదేవపూర్:
బీరు బాటిల్లలో ఫంగస్ రావడంతో ఆందోళన చేపట్టారు. అయితే బీరు ఇలా రావడం ఏంటని వైన్ షాపుకు వెళ్లి అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో పో… ఈ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులకు చెప్పినా తమకేమీ కాదంటూ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలటా ఉన్నాయి. జిల్లాలోని రేగొండకు చెందిన కొంతమంది ఆధివారం కాళేశ్వరంలోని తెలంగాణ వైన్స్ కు వెల్లి బీర్లు కొనుగోలు చేశారు. ఒక బీరు తీసుకుని తాగుతున్న క్రమంలో అతను వాంతి చేసుకున్నాడు. దీంతో మరో బీరును గమనించగా అందులో ఫంగస్ ఫామ్ అయినట్టుగా గుర్తించారు. దీంతో తెలంగాణ వైన్స్ వద్దకు వెల్లి ఇదేంటని వారు నిలదీశారు. అయితే ఏం చేసుకుంటావో చేసుకో పోండి, భూపాలపల్లిలో ఏ ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేసిన ఫర్వాలేదంటూ దురుసుగా సమాధానం చెప్పారని రేగొండ వాసులు ఆరోపించారు. బీరులో వచ్చిన ఫంగస్ గురించి అడిగేందుకు వెల్లిన తమపై వైన్ షాపులో ఉన్న వారు వ్యవహరించిన తీరుతో కలత చెందామన్నారు. అధికారులు బీరులో వచ్చిన ఫంగస్ విషయంపై చర్యలు తీసుకుని వైన్ షాపు నిర్వహాకుల తీరుపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.