నాలుగు దశాబ్దాల పాటు జననాట్య మండలి అనుభందం

నాలుగు దశాబ్దాల అనుబంధం

2012 నుండే పార్టీకి బై బై…

దిశ దశ, హైదరాబాద్:

చికిత్స పొందుతూ గద్దర్ మరణించడం ఆవేదనను కల్గించిందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన తరువాత మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గద్దర్ అంటే దేశంలోనే తెలియని వారు ఉండరని ఆయన మరణం పార్టీని తీవ్రంగా బాధించిందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నామన్నారు. నక్సల్బరీ, శ్రీకాకుళలం పోరాటాల ప్రేరణతో తెలంగాణాలో భూ స్వామ్య వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభం అవతున్న సమయంలో పాటలు, నాటిలకలు, బుర్రకథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాల్లో సమీకరించడానికి సీపీఐ(ఎంఎల్) సాంస్కృతిక బృందాన్ని ఏర్పార్చిందని జగన్ వివరించారు. మొదట్లో ఆర్ట్స్ లవర్స్ అన్న పేరుతో నడవగా 1972లో జన నాట్య మండలిగా ఆవిర్భవించామని, మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందన్నారు. 1972 నుండి 2012 వరకు నాలుగు దశాబ్దాల పాటు ఆయన విప్లవ ప్రస్థానం కొనసాగిందని, పీడిత ప్రజల పక్షాణ నిలబడ్డాడని వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ విప్లవోద్యమ నిర్మాణంలో గద్దర్ విశేషంగా కృషి చేశారన్నారు. జన నాట్య మండలి ద్వారా ప్రజా సాహిత్యాన్ని పాటల రూపంలో, కథల రూపంలో నాటకాల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తూ భూస్వామ్య వ్యతిరేక పోరాటం వైపు ప్రజలను కదలించడంలో కీలక పాత్ర పోషించారని జగన్ తెలిపారు. ఏఎల్ఆర్ఎస్ కార్యదర్శిగా కూడా పని చేసిన ఆయన 1980వ దశాబ్దంలో నాలుగేళ్ల పాటు యూజీలో కూడా పనిచేశాడని, ఆ తరువాత సాంస్కృతిక రంగ ఆవశ్యకతను గుర్తించిన పార్టీ ఆయనను బయటకు పంపించి జన నాట్య మండలి అభివృద్ది బాధ్యతలను అప్పగించిందన్నారు. ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలు వారి కుటుంబాలకు చేరకుండా వ్యవహరించిన సందర్బాలలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడని, దోపిడీ పాలకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలు ఏర్పాటయ్యాయని, పోలీసుల ద్వార ఏర్పడిన నల్లదండు ముఠాలు ప్రజా సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని అంతమొందించే కుట్రలు జరిగాయని జగన్ ఆరోపించారు. అందులో భాగంగానే 1997లో నల్లదండు ముఠా కాల్పులు జరిపగా ఐదు తుటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడన్నారు. తెలంగాణాలో ఉన్నత స్థాయిలో సాగుతున్న వర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవకారులను, యువతి, యువకులను జన నాట్య మండలి పాటలతో ఉర్రూతలుగించిన ఘనత గద్దర్ కే దక్కుతుందన్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పాని చేశారని, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని, ఈ సమయంతో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల గురించి పాటలు రాసినట్టు కూడా జగన్ వివరించారు. అయితే 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడని, పాలక పార్టీలతో కలిసిపోవడంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా ఆయన 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడని జగన్ పేర్కొన్నారు.

You cannot copy content of this page