సియాసిత్ ఎడిటర్ మృతి…
దిశ దశ, హైదరాబాద్:
గద్దర్ అంత్యక్రియల్లో అప శృతి దొర్లింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసిత్ మేనేజింగ్ డైరక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృత్యువాత పడ్డారు. అంత్యక్రియల్లో జరిగిన తోపులాట కారణంగా కార్డియక్ అరెస్ట్ కావడంతో ఆయన అక్కడిక్కడే మరణించాడని తెలుస్తోంది. అపస్మారకస్థితికి చేరిన జహీరుద్దీన్ అలీఖాన్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విద్యావంతుల వేదిక సమావేశంలో హాజరైన ఆయన సోమవారం సాయంత్రం విగతజీవిగా మారడం పలువురిని కలిచివేస్తోంది. ఉర్దూ మీడియా రంగంలో సియాసత్ పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది. ఊర్దు మాధ్యమంలో వెలువడే పత్రికల్లో సియాసత్ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆ పత్రికకు జహీరుద్దీన్ అలీఖాన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. అప్పటి వరకు తమతో మాట్లాడిన వ్యక్తి కానరాని లోకాలకు చేరుకున్నాడన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరోకరి మృతి
ప్రజాయుద్ద నౌక అంతిమ సంస్కారంలో మరోచోట జరిగిన తోపులాటలో కూడా ఒకరు మృతి చెందారు. ఆయన కడసారి చూసేందుకు వచ్చిన అభిమానలు తోసుకోవడంతో లక్డికాపూల్ ఏరియాకు చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డారు.
బౌద్ద ఆచారం…
అల్వాల్ లోని మహాబోధి పాఠశాల ఆవరణలో విప్లవ కెరటం గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. బౌద్ద ఆచారం ప్రకారం గుమ్మడి విఠల్ అంత్యక్రియల తంతును పూర్తి చేశారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం ఆచారం ప్రకారం చివరి ఘట్టాన్ని నిర్వహించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post