దిశ దశ, హైదరాబాద్:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ మిషన్ వాయిదా వేస్తున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. శనివారం ఉదయం 8 గంగలకు గగన్ యాన్ టెస్ట్ వెహికిల్ పంపించేందుకు అన్ని సిద్దం చేసుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించక రెండు సార్లు సమయాన్ని వాయిదా వేసిన శాస్త్రవేత్తలు 8.45 గంటలకు ప్రయోగం చేస్తామని ప్రకటించారు. అనూహ్యంగా సాంకేతిక సమస్య ఎదురు కావడంతో తాత్కాలికంగా గగన్ యాన్ మిషన్ ను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుడి గగన్ యాన్ ప్రయోగం చేసి వ్యోమోగాములను అంతరిక్షానికి పంచించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావించారు. అనూహ్యంగా ఇంజిన్ ఇగ్నీషన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశామని, రీ షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఇస్రో ప్రకటించింది.
https://twitter.com/ISROSpaceflight/status/1715573330810753489?t=eTy4I4CwpDXL0yLv9oRIVA&s=19