ఖైరతాబాద్ వినాయుకుడి దర్శనం ఇలా…

దిశ దశ, హైదరాబాద్:

విఘ్నేశ్వరుని ప్రతిమలను ఏర్పాటు చేయడంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఏటా ఇక్కడ అంగరంగ వైభంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రాదాయంగా వస్తున్న ఈ ఆనావాయితీలో భాగంగా ఏటా ఒక్కో రూపంలో విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఈ సారి శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మీడియాకు విడుదల చేసింది. ఈ సారి 63 ఫీట్ల ఎత్తులో తయారు చేయనున్న ఈ ఉత్సవాలు 69 ఏళ్లుగా సాగుతున్నాయి. ఓ వైపున శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహ స్వామి, మరో వైపున శ్రీ వీరభద్ర స్వామి కొలువు తీరనుండగా మధ్యలో విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

19న వినాయక చవితి

ఈ ఏడాది సెప్లెంబర్ 19న భాద్రపద చవితిని పురస్కరించుకుని వినాయక చవితి పర్వదినం నిర్వహించాల్సి ఉండగా 28వ తేది వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది.

You cannot copy content of this page