గిఫ్ట్ డీడ్ భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు అడిగి…

దిశ దశ, గంగాధర: 

గిఫ్ట్ డిడ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా లంచం అడిగి అడ్డంగా దొరికిపోయాడు సబ్ రిజిస్ట్రార్. ఓ వైపున ఏసీబీ ఝులు విదిల్చి దాడులు చేస్తున్నా లంచవతారాలు మాత్రం తమ బుద్దిని మార్చుకోవడం లేదు. తాజాగా మరో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్ జిల్లా గంగాధర ల్యాండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు శనివారం రూ. 10 వేలు లంచం తీసకుంటూ పట్టుబడ్డారు. అంజయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు అజయ్ కుమార్ కు అతని తండ్రి ద్వారా గిఫ్ట్ గా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 10 వేలు లంచం అడిగాడు. దీంతో అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శనివారం ఎస్ఆర్ఓ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ డబ్బులు ఆఫీసు సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ద్వారా తీసుకుంటుడగా పట్టుకున్నారు. ఏసీబీ ట్రాప్ అయిన తరువాత వాంగ్మూలాలు సేకరించారు ఏసీబీ అధికారులు. వీరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని డీఎస్పీ రమణ మూర్తి మీడియాకు తెలిపారు.

ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్… 

లంచం తీసుకునే అధికారులు మరోకరి ద్వారా డబ్బులు తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టడంతో అనామాకులు బలవుతున్నారు. పెద్ద సారే దగ్గర అయ్యాడన్న ధీమాతో లంచం తీసుకునేందుకు సాహసిస్తే కటకటాల పాలుకాక తప్పడం లేదు. గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఇంఛార్జి ఎస్ఆర్ఓ సురేష్ కోసం లంచం డబ్బులు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ కూడా కేసులో ఇరుక్కున్నాడు. కుటుంబ పోషణ కోసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగం చేస్తున్న నిరుద్యోగులు అధికారుల కనుసన్నల్లో దారి తప్పుతుండడమే వారి పాలిట శాపంగా మారింది. ఏసీబీ కేసు క్లోజ్ అయ్యే వరకూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తయారు కాగా వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడక తప్పడం లేదు. 

You cannot copy content of this page