చిరు వ్యాపారికి గ్యాంగ్ స్టర్ ఫోన్

కోటి ఇవ్వాలని డిమాండ్

చిరు వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వృద్ధుడికి ఓ రోజు రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. తాను గ్యాంగ్ స్టర్ నంటూ అపరిచితుడు ఫోన్ లో చెప్పి తనకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఆ వృద్ధ చిరు వ్యాపారి గందరగోళానికి గురయ్యాడు. తాను చేస్తున్నదే చిరు వ్యాపారం ఆ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. బోటాబోటి ఆదాయంతో కాలం వెల్లదీస్తున్న తాను ఫోన్ చేసిన వ్యక్తికి కోటి ఇవ్వాలంటే ఎలా.? అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలని ఆందోళన చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్న వృద్దుడు ఏం చేయాలో పాలు పోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. బంధువుల సలహా మేరకు పోలీసులను ఆశ్రయించిన వృద్ధుడు గ్యాంగ్ స్టార్ ఫోన్ లో ఇచ్చిన వార్నింగ్ కన్నా ఆ నిందితుడిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పంజాబ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే…. అచ్చు సినిమా కథను తలపిస్తోన్న ఈ సంఘటన పంజాబ్‌లోని పటాన్‌కోట్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… తన దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా వృద్ధ చిరు వ్యాపారికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ఢిల్లీ నుండి మాట్లాడుతున్నానని, తనకు ‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట విని ఆందోళన చెందిన ఆ వృద్ద వ్యాపారి వెంటనే ఫోన్‌ కట్‌ చేయగా మళ్లీ ఫోన్‌ చేసి వార్నింగ్ ఇచ్చాడు ఆగంతకుడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడంతో వారి సలహాతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు షాపుర్‌ కండీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు ఛేదించి గ్యాంగ్ స్టర్ ఎవరో చెప్పడంతో సదరు చిరు వ్యాపారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు బాధితుని మనవడే కావడంతో ఆ వృద్దుడు షాక్ కు గురయ్యాడు. బడా వ్యాపారవేత్తను కాదని, భూములు, ఇతర ఆస్తులు కూడా లేని నాకెందుకు గ్యాంగ్‌ స్టర్‌ ఫోన్‌ చేశాడోనని ఆశ్చర్యమేసిందని బాధితుడు తెలిపారు. తన తాతను బెదిరించేందుకు కొత్త సిమ్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజిందర్‌ మంహాస్‌ తెలిపారు.

You cannot copy content of this page