గౌరవెల్లి ప్రాజెక్టుపై మూడో నేత్రం

దిశ దశ, హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టుపై ఇక మూడో నేత్రం పని చేయనుంది. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల నిఘా నీడన ప్రాజెక్ట ఏరియా ఉండనుంది. శనివారం గౌరవెల్లి ప్రాజెక్టుపై అధికారులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గుడాటిపల్లికి చెందిన నిర్వాసితులు బద్దం భాస్కర్ రెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, కొత్త సంజీవ్, రాగి శివ కుమార్ లు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచిను ఆశ్రయించారు. ఎన్టీటీ కేసు OA56/2023లో ఆగస్టు 28న ఇచ్చిన తీర్పు మేరకు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచినప్పటికీ ఎలాంటి అనుమతులు లేవని, పర్యవారణ అనుమతులు పొందే వరకు కూడా పనులు జరగకుండా చూడాలని ఎన్జీటీ అధికారులను ఆదేశించింది. ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలను బిగించాలని కూడా నిర్దేశించడంతో గోదావరి బేసిన్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వీటిని హైదరాబాద్ గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 10 నుండి 12 సీసీ కెమరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

You cannot copy content of this page