స్టేట్ ఛైర్మన్ గా నియామకం
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ గిఫ్ట్ అందించారు. రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంతకాలం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా వెలువడిన ఉత్తర్వులతో ఆయనకు రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ పోస్టు వరించినట్టయింది.
