ఉచిత శిక్షణ పొంది ఉన్నతులుగా ఎదగండి

రియల్ ఎస్టేట్ ట్రైనర్ డాక్టర్ శివకుమార్

దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతోందని ప్రముఖ లైఫ్ కోచ్, ఏబిఎన్ ఎల్పీ ట్రైనర్, ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీ మరియు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ నాచురోపతి ప్రాక్టీషనర్ డాక్టర్ శివ కుమార్ అన్నారు. వృత్తిపరంగా సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల రియల్ రంగంలో స్థిరాస్తి అమ్మకం, కొనుగోలుదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శివకుమార్ గత మూడేళ్ళుగా వేలాది మందికి రియాల్టీ రంగంపై పూర్తి అవగాహన కల్పిస్తూ… క్రయవిక్రయాలకు సంబంధించిన మార్కెటింగ్ పై వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ మీమాంస వెల్ నెస్ రిసార్ట్స్ లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2వేల మంది తర్ఫీదు పొందారు. అపార అవకాశాలు ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ప్రొఫెషనల్ గా డీల్ చేస్తే సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవచ్చన్నారు. సమాజ సేవలో భాగంగా, రియల్ ఎస్టేట్ రంగంపై తనకున్న మక్కువతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. నిబద్దతతో కూడిన నిజాయితీతో సెల్లర్ కు బయ్యర్ కు సేవలందించాలని, అప్పుడే ఈ రంగంలో సక్సెస్ అవుతామన్నారు. మూడేళ్ళుగా ఇస్తున్నతన శిక్షణలో 500 మంది విజయవంతంగా రియల్ రంగంలో స్థిరపడడం సంతోషకరంగా ఉందని డాక్టర్ శివకుమార్ అన్నారు. ఒక్క రియల్ రంగమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం అజీజ్ నగరే కాకుండా నాగర్ కర్నూల్, గోవా, తిరుపతిలలో మీమాంస వెల్ నెస్ రిసాట్స్ ప్రారంభం అవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా మరో పది మీమాంస వెల్ నెస్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ శివకుమార్ తెలిపారు. తాను ఉచితంగా అందించే శిక్షణ ద్వారా పరిపూర్ణమైన అవగాహన పొంది న్యాయబద్దంగా క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నతంగా ఎదగాలన్నదే తన లక్ష్యమన్నారు. స్థలం కొనే వారికి, అమ్మే వారికి సముచితమైన సేవలు అందించినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

డాక్టర్ శివ కుమార్

You cannot copy content of this page