తక్కువ పెట్టుబడి పెట్టి ఇంటి దగ్గరే ఉండి కూడా బిజినెస్ చేసుకోగలిగే సరికొత్త హోల్సేల్ బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ బిజినెస్ కు పది వేల నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
మనందరికి కాఫీ పౌడర్ గురించి తెలుసు. దీన్ని ప్రతి ఇంట్లో వాడుతుంటాము. ఈ కాఫీ పౌడర్ బిజినెస్ ఆదాయం గురించి మీకు తెలిస్తే ఆలస్యం చేయకుండా మొదలు పెడతారు. ఎందుకంటే ఏ బిజినెస్లో లేనంతగా ఈ కాఫీ పౌడర్ బిజినెస్ లో 50% పైగా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది.
చాలామంది ఉదయాన్నే వేడివేడి పొగలు కక్కే కాఫీ తాగుతుంటే స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది . కమ్మని కాఫీ వాసన చూడగానే శరీరం మొత్తం యాక్టీవ్ అయిపోతుంది. కొంతమందికి బెడ్ దిగక ముందే కాఫీ కప్ చేతిలో ఉండాలి. మరి కొందరు ఐదారు కాఫీల కప్పుల కాఫీ తాగేస్తుంటారు. అలసిపోయిన శరీరానికి కాఫీ టానిక్ లా పనిచేస్తుంది. సో మార్కెట్లో కాఫీకి ఇంత ఆధారం ఉండటం వల్ల కాఫీ పౌడర్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుందే కానీ… తగ్గట్లేదు.
మీరు కొంచెం పెట్టుబడి కొంచం సమయం కేటాయించి ఈ కాఫీ పౌడర్ బిజినెస్ ప్రారంభిస్తే అతి తక్కువ కాలంలోనే లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు .
కానీ ఇంతకు కాఫీ పౌడర్ ను తక్కువ ధరలో ఎవరు సప్లై చేస్తారు కాఫీ పౌడర్ ధరలు ఎలా ఉంటాయి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి. ఎవరికి ఈ కాఫీ పౌడర్ను సేల్ చేసుకోవాలి. అనేకదా మీ సందేహాలు ఇప్పుడు ఆ విషయాలని తెలుసుకుందాం ఇండియాలో ప్రముఖ కాఫీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ సమస్త అయినా జె బి ఎస్ కాపీ ఇండస్ట్రీస్ మీకు బల్క్ లో సప్లై చేస్తుంది. ఇంటి వద్ద నుండి బిజినెస్ చేసే మహిళలు ఇక ఇతర వ్యాపారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.