దిశ దశ, జాతీయం:
విడాకులు తీసుకున్న భర్త ద్వారా నెలకు రూ. 6.16 లక్షల భరణం ఇవ్వాలని అడిగింది ఓ మహిళ. తాను జీవించడానికి ప్రతి నెల అంత మొత్తంలో ఇప్పించాలని న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత తన భర్త నుండి విడాకులు పొదారు. అయితే తాను జీవించేందుకు భరణం ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతి నెల రూ. 6.16 లక్షలు భరణం కింద ఇప్పించాలని ఆ పిటిషన్ లో అభ్యర్థించారు. భోజనం ఖర్చులకు రూ. 40 వేలు, వాచీలు, గాజులు, చెప్పులకు రూ. 50 వేలు, వైద్యం, కాస్మోటిక్స్ కోసం రూ. 4.5 లక్షలు ఇప్పించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఆ పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు విన్న జడ్జి ఇందుకు సమ్మతించలేదు. అంత డబ్బులు నెలనెల భరణం పేరిట ఇప్పించడం చట్టం కాదని జడ్జి తేల్చి చెప్పారు. భరణం కోరిన పిటిషనర్ తరుపు న్యాయవాది జడ్జికి వివరించే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. మరో వాయిదా రోజున అఫిడవిట్ మార్చాలని కూడా సూచించారు. భర్త నుండి ఇంత భారీగా భరణం అడిగిన ఘటన దేశంలోనే అరుదైనది కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.