పోటీ చేసే విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తా…

ధర్మ రక్ష ఫౌండేషన్ ఛైర్మెన్ చీకోటి ప్రవీణ్…

దిశ దశ, కరీంనగర్:

హిందూ సమాజ అభ్యున్నతి కోసం పాటుపడే వారికి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ధర్మ రక్ష ఫౌండేషన్ ఛైర్మెన్ చీకోటి ప్రవీణ్ అన్నారు. శనివారం కరీంనగర్ లో మల్టీ బ్రాండెడ్ సైకిల్ షోరూం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదన్నారు. మూడు నుండి నాలుగు వేల ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఎమ్మెల్యేలు గెలుస్తారన్నారు. రాష్ట్రంలో హిందూ దేవుళ్ల కోసం, హిందూ సమాజాం కోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా తన మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ఓటర్లు కూడా హిందూ సమాజ అభ్యున్నతి కోసం పాటు పడే వారికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వారం పదిరోజుల్లో క్లారిటీ ఇస్తానని చీకోటి ప్రవీణ్ వెల్లడించారు.

You cannot copy content of this page