గో బ్యాక్… తెలంగాణలో పాకిస్తానీయల కోసం సెర్చింగ్ స్టార్ట్…

దిశ దశ, హైదరాబాద్:

ఉగ్ర మూకలు విచక్షణ రహితంగా కాల్చి చంపిన తరువాత భారత్ దూకుడు పెంచింది. టెర్రరిస్టులకు దాయాది దేశం పాకిస్తాన్ అండగా నిలుస్తున్న తీరును ఎత్తి చూపిన భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది. పహల్గావ్ ఘటనపై రివేంజ్ తీసుకునేందుకు భారత బలగాలను కార్యరంగంలోకి దింపిన కేంద్రం మరో వైపున పాకిస్తాన్ తో అమితుమీకి సిద్దం కావాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుండి వాఘా బోర్డర్ గేట్ కూడా క్లోజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందంటే ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చిన వారందరు వెనక్కి వెళ్లిపోవల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలో ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రాల వారిగా పాకిస్తాన్ పౌరుల డాటా అంతా కూడా సేకరించిన ఇంటలీజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.

తెలంగాణాలో…

తెలంగాణాలో పాకిస్తాన్ నుండి వచ్చిన వారు 208 మంది ఉన్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. వీరిలో 156 మంది దీర్ఘ కాలిక వీసాలు పొందగా, 13 మంది స్వల్ప కాలిక వీసాలతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. మరికొంత మంది వైద్య చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ వచ్చిన వారు మెడికల్ వీసాలపై వచ్చి హైదరాబాద్ నగరంలో ఉంటున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారికి, వారి రక్త సంబంధీకులకు లాంగ్ టర్మ్ వీసాలు అలాట్ చేసే విధానం అమల్లో ఉండగా సార్క్ వీసా ద్వారా మాత్రం మన రాష్ట్రంలో ఎవరూ లేనట్టుగా అధికారులు గుర్తించారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్ ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వారి వివరాలను నమోదు చేసుకోవల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశీయులు మాత్రం పాతబస్తీ పురానీ హవేలీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ వింగ్ రికార్డుల ఆదారంగానే హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారని అధికారులు గుర్తించారు వీరంతా కూడా ఈ నెల 27 లోగా హైదారాబాద్ విడిచిపెట్టి వెళ్లాలని, డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పౌరుల వీసాలు అన్నీ కూడా రద్దయ్యాయని ఈ నెల 30 నుండి వాఘా సరిహధ్దులను కూడా మూసివేయనున్నట్టుగా డీజీపీ వెల్లడించారు.

You cannot copy content of this page