దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించేనా..?

అకాల వర్షాలు కల్గించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వండగండ్లు మిగిల్చిన కడంగండ్లతో బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూస్తున్న రైతన్నకు బాసటగా నిలిచేవారే లేకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వడంగడ్ల వానతో లబోదిబోమంటున్న రైతాంగం పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నష్టపోయిన రైతులకు బాసటగా నిలవాలని ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి మ ప్రకృతి ప్రకోపం వల్ల రెండో సారి కూడా పంటలు దెబ్బతినగ, విద్యుత్ సరఫరా కూడా ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు నేటికి కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరించే పనిలో నిమగ్నమమయ్యారు. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు తరుచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండడంతో రైతాంగం పంటలు బాగు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వర్షం వల్ల పంట నేలకొరగగా, వర్షపు నీరు చేరి కొంత పంట నాశనం అయింది. మరికొన్ని చోట్ల నీరు లేక విద్యుత్ సరఫరా సరిగా జరగకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్ని విధాలుగా నష్టపోతున్న పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఇంతటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి ఎకరాకు రూ. 10 వేల సాయం ప్రకటించడంతో రైతులు వేన్నీళ్లకు చన్నీళ్లు తొడయినట్టుగా ఉంటుందిన రైతాంగం ఆశించింది. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. ముఖ్యమంత్రి ప్రకటన తరువాత జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కూడా నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. కానీ యంత్రాంగంలో మాత్రం సరైన స్పందన లేకపోవడంతో సర్కారు సాయం అందుతుందా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది రైతాంగంలో. రెండు రోజులుగా వ్యవసాయ శాఖ యంత్రాంగంలో పొలం బాట పట్టి పంట నష్టం అంచనాలు తయారు చేస్తుండగా హర్టి కల్చర్ అధికారులు మాత్రం నేటికీ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదన్న రైతులు అంటున్నారు. దీంతో హర్టికల్చర్ విభాగం పరిధిలోకి వచ్చే పంటలకు పరిహారం అందుతుందా లేదా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా పంటలు నష్టపోయినట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు ఇస్తారోనన్నది అంతుచిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page