దిశ దశ, భద్రాచలం:
భద్రాచలం వద్ద గోదావరి నది ఇంకా పొంగిపొర్లుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి భద్రాచలం వద్దకు చేరుతోంది. శనివారం ఉదయం భద్రాచలం వద్ద 54.30 మీటర్లకు నీటిమట్టం చేరగా రామాలయంతో పాటు పరిసర ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుండి 13,37,330 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండగా, ఇంద్రావతి నదికి దిగువన ఉన్న తుపాకుల గూడెం బ్యారేజ్, తాలిపేరు బ్యారేజీల నుండి వరద భద్రాద్రి సమీపంలో గోదావరిన నదిలో కలుస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.
