EB-5 స్థానంలో గోల్డ్ కార్డ్… ధర ఎంతో తెలుసా..?

అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం బంపర్ ఆఫర్…

దిశ దశ, అంతర్జాతీయం:

అగ్ర రాజ్యంలో శాశ్వత పౌరసత్వం పొందే సంపన్నులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డ్ ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అగ్రరాజ్యం తన దేశంలో శాశ్వత పౌరసత్వం పొందాలనుకునే సంపన్నులకు గోల్డ్ కార్డు ఇస్తామని ప్రకటించింది. ప్రపంచలోని సంపన్నులకు ఆకట్టుకుని గోల్డ్ కార్డు విక్రయిస్తే తమ దేశంలో పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు, వ్యాపారాల ద్వారా జరిగో టర్నో వర్ వల్ల భారీ ఆదాయం గడించవచ్చన్న యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం (EB-5) ద్వారా ఇప్పటి వరకు అమెరికా గ్రీన్ కార్డు విధానం అమలు చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందేందుకు 1990లో కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఈబీ 5 ద్యారా శాశ్వత పౌరసత్వం పొందాలంటే నాన్ టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (TEA) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు కానీ TEAలో 8 లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన ఉండేది. ఈ ప్రోగ్రాంలో పెట్టుబడి దారులు వారీ జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల వయసు లోపల ఉన్న వారికి శాశ్వత పౌరసత్వం ఇచ్చే విధానం అమల్లో ఉండేది. అయితే ఇందులో USAకు చెందిన 10 శాతం మంది కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలన్న నిబంధన కూడా విధించారు. ఈ విదానాన్ని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్విసెస్ వింగ్ (USCIS) పర్యవేక్షణ జరిపేది. తాజాగా అమెరికా ప్రభుత్వం గోల్డ్ కార్డు విధానం అమల్లోకి తీసుకరావడంతో ఇందులో భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే గోల్డ్ కార్డ్ ద్వారా శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని ఇందుకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్నామని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి. భారతీయులు 50 లక్షల డాలర్లు అంటే రూ. 43.5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు కూడా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులు అమెరికాకు వచ్చినట్టయితే… వారి ద్వారా వచ్చే ఆదాయం భారీగా వస్తుందన్న యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page