అమెరికా డాలర్ రేటు తగ్గడంతో బంగారం ధరలు స్థిరంగా ఉండటల్లేదు .ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేడు బంగారం ధరలు రూ. 57,300 గా ఉంది . 10 గ్రాముల బంగారం ధర ఈ రేంజులో ఉండటం ఇదే మొదటి సారి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి . అలాగే దేశంలో కూడా బంగారం ధరలు రోజు రోజుకి కొండెక్కుతున్నాయి. దీంతో ఇప్పుడు బంగారం కొనాలను వారికి కష్టాలు వచ్చి పడినట్టే. అయితే బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారి పంట మాత్రం పడిందని చెప్పుకోవచ్చు.
బంగారం ధర ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 20 శాతం పెరిగిందని ట్రేడ్ వర్గ నిపుణులు వెల్లడించారు . అంతేకాకుండా రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా ఎక్కువ పెరిగిన కూడా ఆశ్చర్యపడాలిసిన అవసరం లేదు.
2022లో మార్చి నెలలో బంగారం ధర 1950 డాలర్లకు చేరింది. ఆ సమయంలోనే అక్టోబర్ నెలలో బంగారం రేటు 1636 డాలర్లకు తగ్గింది . మళ్ళీ ఇప్పుడు రికార్డు స్థాయిలో 2 వేల డాలర్లకు దగ్గరలో ఉంది.
బంగారం రేటు రాబోయే రోజుల్లో మార్కెట్‌లో రూ. 62 వేలకు చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. ఇదే నిజమైతే బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల బాట పట్టినట్టే.కాబట్టి బంగారం కొనాలనుకునే వారు రేట్లు తగ్గిన కొనుక్కోవడం మంచిది. లేదంటే మీ జేబుల నుంచి దాచుకున్న డబ్బులు కూడా పెట్టాలిసి ఉంటుంది.