అర్జున్ రెడ్డి దర్శకత్వంలో గోనె గన్నారెడ్డి

పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశమంతటా క్రేజ్ ను సంపాదించాడు. సౌత్ తో పాటు ముఖ్యంగా నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ గా పాటలు, డ్యాన్సులు, డైలాగ్స్ తో తగ్గేదేలే అంటూ ఒక ఊపు ఊపాడు బన్నీ. పుష్ప సినిమాతో బాలీవుడ్ బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ కూడా భారీగానే రాబట్టాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ప్రకటించాడు. తాజాగా ఐకాన్ స్టార్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు జరిపాడు. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయి బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా నేడు ఉదయం అల్లు అర్జున్ సడెన్ గా సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ మరియు సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కలిసి నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ప్రకటించడంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ రణవీర్ సింగ్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా ఉంది. మరి ఆ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేస్తాడా లేదా ప్రభాస్ సినిమా ఆపి బన్నీతో ముందు చేస్తాడా చూడాలి. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా తర్వాత బోయపాటి కాంబోలో సినిమా ఉంది. ఆ సినిమా ఆపుతాడా లేక అది అయ్యాక చేస్తాడా చూడాలి. మొత్తానికి ఈ సరికొత్త కాంబోకి అంతా ఆశ్చర్యపోయినా బన్నీ అభిమానులు ఇలా సడెన్ గా కొత్త సినిమా ప్రకటించడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. పుష్ప తో ఇప్పటికే బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఈ సినిమాతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అయిపోతాడు అని అంటున్నారు అభిమానులు.

You cannot copy content of this page