బీరు ప్రియులకు కిక్కిచ్చే ఖబర్

దిశ దశ, జగిత్యాల:

దాదాపు ఐదేళ్లుగా వారు అక్కడి బీరు ప్రియులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. మండుతున్న ఎండలను తట్టుకునేందుకు చల్లటి బీరు కడుపులోకి వెల్తే ఎంత హాయిగా ఉంంటుందోనన్న ఆనందం వారిని వెంటాడుతోంది. మార్కెట్లో ఎన్నో రకాల బీర్ల విక్రయాలు జరుగుతున్నా తమ జిహ్యకు రుచించే బ్రాండ్ బీర్ల అమ్మకాలు మాత్రం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన బీరు ప్రియులు. అయ్యా తమకు నచ్చిన ఫలనా బ్రాండ్ లిక్కర్ సేల్స్ చేయించేందుకు చొరవ తీసుకోండి అంటూ పలుమార్లు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. తాము పెడుతున్న దరఖాస్తులు బుట్ట దాఖలే అవుతున్నాయని కలత చెందుతున్న బీరు ప్రియులకు అత్యంత ప్రీతికరమైన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎక్సైజ్ అధికారులు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిల్లోని రిటేల్ షాపులతో పాటు, బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా అన్ని రకాల బ్రాండ్లను విక్రయించాలని, ఇందులో కింగ్ ఫిషర్ బీర్ కూడా ఉండాల్సిందేనని జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ పి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్ విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి చేసిన బీరం రాజేష్ కు కూడా ఉత్తర్వుల ప్రతులను పంపించారు ఎక్సైజ్ అధికారులు.

అమలయ్యేనా..?

డిమాండ్ ఎక్కువ… మార్జిన్ తక్కువగా ఉండే కింగ్ ఫిషర్ బీర్ల విక్రయాలపై జగిత్యాల జిల్లాలో లిక్కర్ వ్యాపారులు విముఖత చూపుతున్నారు. సిండికేట్ గా ఏర్పడ్డ వ్యాపారులు ఈ బ్రాండ్ అమ్మకాల వల్ల తమకు ఒరిగేదేమీ లేదని భావించి వాటిని ఐఎంఎల్ డిపోల నుండే తీసుకోవడం మానేశారు. దీంతో తమకు ఇష్టమైన బ్రాండ్ బీర్లు దొరకక జిహ్వ చాపల్యం చంపుకోలేక కొంతమంది ఇతర ప్రాంతాలకు వెల్లి కింగ్ ఫిషర్ కొనుగోలు చేసుకునేవారు. అయితే తాజాగా జిల్లా కలెక్టర్ కు బీరం రాజేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో ఎక్సైజ్ అధికారులు కూడా కింగ్ ఫిషర్ బీర్లు అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలోని లిక్కర్ వ్యాపారులు వీరి ఆదేశాలను ఏమేరకు అమలు చేస్తారన్నదే అంతుచిక్కకుండా పోయింది. వాస్తవంగా ఐఎంఎల్ డిపోల్లో ఆమోదం పొందిన బ్రాండ్లను విధిగా తమ తమ షాపుల్లో విక్రయించాల్సింది పోయి తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారులు వ్యవహరించినా ఎలాంటి చర్యలు తీసుకేలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐఎంఎల్ డిపోల్లో నిభందనలకు అనుగుణంగా అన్ని రకాల బ్రాండ్లను, అందులో డిమాండ్ ఉన్న కింగ్ ఫిషర్ లాంటి బీర్లను విక్రయించకపోవడంపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page