నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2826 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీఎన్ఎల్ జాబ్ రిక్రూట్మెంట్ 2023 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. సెంట్రల్ సూపరింటెండెంట్ 314 ఖాళీలు ఉండగా.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ 628 ఖాళీలు, ఆఫీస్ అసిస్టెంట్ 314, ట్రైనర్ 942 పోస్టులు, ఎంటీఎస్ 628 పోస్టులు ఉన్నాయి.
పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణణ కాగా.. వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.10 వేలు జీతం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. www.bharatiyapashupalan.comలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనర్ పోస్టులు 942 ఉండగా.. ఈ పోస్టులకు అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం రూ.15 వేలు ఉంటుంది.
ఇక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 314 ఉండగా.. 12వ తరగతి ఉత్తీరణ. వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.12 వేలు ఉంటుంది. ఇక అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు 628 ఉండగా.. దీనికి 12వ తరగతి, తత్సమాన ఉత్తీర్ణణ. వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.15 వేలు ఉంటుంది. సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్టులు314 ఉండగా.. ఈ పోస్టులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ. వయస్సు 24 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉండాలి.
ఈ పోస్టులకు జీతం రూ.,18 వేలు ఉంటుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.