రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. పలు పథకాలతో చాలా మంది రైతులను ప్రయోజనం పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్‌ను రైతుల కోసం తీసుకొచ్చారు. అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6వేలు ఉచితంగా అందిస్తోంది. మూడు విడతలుగా రూ.2వేల చొప్పున రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయి.
ఇక రైతు భరోసా స్కీమ్‌ను సైతం ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. అలాగే తెలంగాణ సర్కార్ అన్నదాతలకు రైతు బంధు స్కీమ్‌ను తీసుకొచ్చారు. కాగా, కేంద్రం ప్రభుత్వం రైతులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ అందిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఈ సదుపాయాన్ని ఇస్తోంది. ఈ స్కీమ్‌తో రైతులు కేవలం నాలుగు శాతం వడ్డీ రేటుకే లోన్‌ను పొందవచ్చు. ఈ స్కీమ్‌ను రైతులు కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి.
తాజాగా కర్ణాటక ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ అందించింది. వడ్డీ రహిత రుణ పరిమితిని పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై రైతులకు రూ.5 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు. వడ్డీ లేకుండానే ఈ రుణాలు పొందొచ్చు. ఏప్రిల్ 1 నుంచి రైతులు వడ్డీ భారం లేకుండా రూ. 5లక్షల వరకు లోన్ పొందవచ్చు. బడ్జెట్ 2023- 24లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే షార్ట్ టర్మ్ లోన్స్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ లోన్ పరిమితిని రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచనున్నారు. లోన్ పరిమితిని పెంచడం వల్ల 30 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం రానుంది. భూ సిరి అనే ఓ కొత్త పథకాన్ని కూడా తీసుకు రానున్నారు.