ఇంఛార్జి మంత్రులకు నిధులు కెటాయింపు… రూ.1190 కోట్లు అలాట్

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల వారిగా అభివృద్ది కోసం నిధులు కెటాయిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 1190 కోట్లు అలాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ. 2 కోట్లు విద్యాభివృద్ది కోసం, రూ. కోటి తాగునీటి సౌకర్యం కోసం, నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం వెచ్చించాలని పేర్కొంది. జిల్లాల ఇంఛార్జీ మంత్రుల ఆమోదంతో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లాకు రూ. 130 కోట్లు కెటాయించగా ఇందులో రూ. 26 కోట్లు విద్యారంగ మౌళిక వసతులను సమకూర్చడానికి, రూ. 13 కోట్లు తాగు నీటి సౌకర్యం కోసం, రూ. 6.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయల కోసం కెటాయించారు. మహబూబ్ నగర్ రూ. 140 కోట్లు, ఖమ్మం రూ. 100, రంగారెడ్డి రూ. 140, వరంగల్ రూ.120, హైదరాబాద్ రూ. 15 మెదక్ రూ. 100 కోట్లు, ఆదిలాబాద్ 100 కోట్లు, నల్గొండ రూ. 120 కోట్లు, నిజామాబాద్ రూ. 90 కోట్లు కెటాయిస్తూ ప్రభుత్వం జిఓ విడుదల చేసింది.

You cannot copy content of this page