దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యునిపై దాడి కలకలం సృష్టిస్తోంది. డ్యూటీ ముగించుకుని వెల్తుండగా అగంతకులు ఇనుప రాడ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల వైద్యాధికారి మహేందర్ మంగళవారం విధులు ముగించుకుని పెద్దపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని బూరుగుపల్లి శివార్లలోకి చేరుకున్న మహేందర్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్ తలకు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరూ ఇందుకు గల కారణాలు ఏంటీ అన్న వివరాలు మాత్రం తెలియరావడం లేదు. స్థానిక పోలీసులు డాక్టర్ మహేందర్ పై దాడికి పాల్పడిన వారి గురించి ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇందుకు గల కారణాలేంటో కూడా తెలుసుకుంటున్నట్టు సమాచారం.