తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్…

ఇద్దరు ఎమ్మెల్సీల ప్రతిపాదన రిజెక్ట్

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను తిరస్కరిస్తూ గవర్నర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేటెడ్ కోటాల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును రాజ్ భవన్ నుండి తిప్పి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేటెడ్ కోటాలో ఆమోదించాలని గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. ఆర్టికల్ 171(5) కిందకు వీరిద్దరు కూడా రారని గవర్నర్ కార్యాలయం అభిప్రాయపడింది. గవర్నర్ కోటాలో నామినేటెడ్ చేసేందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(1) (ఇ) & 171(5) ఆర్టికల్ 171(3) & (5) ప్రకారం సాహిత్యం, సైన్స్‌లో ప్రత్యేక పరిజ్ఞానం కానీ ఆచరణాత్మక అనుభవం ఉన్న వారికి మాత్రమే శాసనమండలి సభ్యులుగా నామినేట్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని తిరస్కరించిన లేఖలో వివరించారు. కళ రంగం, సహకార ఉద్యమం, సామాజిక సేవల్లో క్రీయాశీలక సేవలు అందించిన వారికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 10 షెడ్యూల్-IIIలో చూపిన విధంగా శాసన మండలిలో సీట్ల కేటాయింపును నిర్దేశిస్తుందని వివరించారు. సెక్షన్ 8 నుండి 11(A)లో పేర్కొన్న అనర్హతలు శాసనమండలికి నామినేట్ కావడానికి స్పష్టంగా వర్తిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో 171 (5) కిందకు వర్తించన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ కారణంగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ప్రతిపాదలను తిరస్కరిస్తున్నట్టు వివరించారు.

You cannot copy content of this page