బండి అపర్ణ సంజయ్ సూచన
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఎమోషన్స్ లేవని మానవ సంబంధాల విలువ తెలియాలంటే బలగం మూవీ చూపించాలని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భార్య అపర్ణ కామెంట్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న సంజయ్ ని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం అపర్ణ మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాను జైలులో ఉన్న సంజయ్ ని కలిసినప్పుడు తన వెన్నంటి నడుస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపాలని కోరారని అపర్ణ వివరించారు. ప్రధాని మోడీ పర్యటన సక్సెస్ చేయాలని కోరడంతో పాటు రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నానని సంజయ్ ఉద్వేగభరితంగా మాట్లాడారని అపర్ణ తెలిపారు. అంతిమంగా గెలిచేది న్యాయమేనని తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేయడంతో పాటు ప్రజ సంక్షమం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న బీజేపీ కార్యకర్తలందరికీ సంజయ్ అభినందించారన్నారు. బండి సంజయ్ ని కలిసిన వారిలో ఆయన పెద్దన్న బండి శ్రవణ్, కరీంనగర్ లోకసభ ఇంఛార్జి బోయినలపల్లి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
భద్రతా వలయంలో జైల్…
బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా జైలుకు జ్యూడిషియల్ రిమాండ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రావడంతో పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి జైలు ఆవరణలోకి ఎవరిని అనుమతిండచం లేదు. కేవలం జైలు సూపరింటిండెంట్ అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలకు తీసుకెళ్తున్నారు. మెయిన్ గేట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.