ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్న ఏఈఓ
దిశ దశ, హైదరాబాద్:
వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి చేసిన దరఖాస్తు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసింది. నాకు వేతనంతో కూడిన సెలవు ఇప్పించండి రాజ్యంగ బద్దమైన పదవికి పోటీ చేస్తానంటూ ఉన్నతాధికారలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని అభ్యర్థనపై అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు కానీ… ఆయన చూపుతున్న కారణాలు కూడా ఆలోచించే విధంగా ఉన్నాయి.
యాదాద్రి జిల్లా…
యాదాద్రి భవనగిరి జిల్లాకు చెందిన కళ్లెపల్లి పరుశురాములు దరఖాస్తు చేసుకున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని నారాయణ్ పూర్ క్లస్టర్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ)గా పని చేస్తున్న ఆయన మూడు రోజుల క్రితం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. తనకు వేతనంతో కూడిన సెలవు ఇప్పించాలని, భూవనగిరి నుండి ఎంపీగా పోటీ చేస్తానని కూడా ఆ లేఖలో వివరించారు.
తప్పేంటి..?
అయితే పరుశురాములు వినిపిస్తున్న డిమాండ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళలకు మెటర్నటీ లీవు ఆరు నెలల పాటు, అలాగే డిప్లోమా చేసిన ఏఈఓలు డిగ్రీ పూర్తి చేసేందుకు నాలుగున్నర సంవత్సరాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నప్పుడు… రాజ్యంగబద్దంగా ప్రజలకు సేవలందించేందుకు పరిపాలించేందుకు ఎంపీగా పోటీ చేస్తే తప్పేమి కాదని ఆయన అంటున్నారు. ప్రజా సేవ కోసం తాను ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నందున తనుకు మూడు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు ఇప్పించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ తాను ఓడిపోతే మూడు నెలల తరువాత తిరిగి ఉద్యోగంలో చేరేందుకు, గెలిచినట్టయితే ఐదేళ్ల తరువాత తిరిగి విధుల్లో చేరే విధంగా సెలవులు ఇప్పించాలని పరుశురాములు కోరుతున్నారు. దేశాభివృద్దిలో పాలు పంచుకునేందుకు తనకు ఈ అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ అలాంటి అవకాశం లేనట్టయితే ఎందుకు లేదో కూడా వివరించాలని పరుశురాములు కోరుతున్నారు.
కారణం ఏంటంటే..?
పరుశురాములు తెరపైకి తీసుకొచ్చని ఈ అంశం వెనక బలమైన కారణమే ఉంది. తమతో పాటు విదుల్లో చేరిన ఇతర శాఖల్లోని ఉద్యోగులు ఇఫ్పుడు గెజిటెడ్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు పొందుతుంటే వ్యవసాయశాఖలో మాత్రం 20ఏళ్లుగా ఇదే పోస్టులో మగ్గిపోతున్నామని పరుశారమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ కంప్లీట్ చేసిన ఏఈలు కూడా ఉన్నప్పటికీ సకాలంలో పదోన్నతులు మాత్రం రావడం లేదున్నారు. దీంతో తాము ఫస్ట్ పోస్టింగ్ పొందిన ఉద్యోగానికే పరిమితం అయ్యామని, తమ బ్యాచ్ కు చెందిన ఇతర శాఖల్లోని చకాచకా పదోన్నతులు పొందుతున్నారని దీనివల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని పరుశురాములు వివరించారు. కోర్టుల ఉత్తర్వులు ఉన్నా కూడా తమకు మాత్రం న్యాయం జరగడంవ లేదని, దీనివల్ల తాము తీరని మనోవేదనకు గురువతున్నామని పరుశురాములు వివరించారు. డబుల్ పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన తాను ఎంతకాలం ఏఈఓగా పనిచేయాలో అర్థం కావడం లేదని, ప్రమోషన్లు మాత్రం అందుకునే పరిస్థితి కనిపిండచం లేదన్నారు. ఇప్పటికే ఎన్నో విధాలుగా పదోన్నతుల కోసం వినతి చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదన్నారు. తమ పదోన్నతుల విషయాన్ని విస్మరిస్తున్నారన్న బాధతోనే తానీ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంచిన ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.