దిశ దశ, న్యూ ఢిల్లీ:
వారిద్దరు సాధారణ జీవితం గడుపుతున్న మహిళలే. నిరాడంబరంగా ఉంటున్న ఈ ఇద్దరి మహిళలను చూస్తే వీరేంటి ఇంత సింపుల్ గా ఉన్నారు…? అసలు వీరు ఆ స్థాయిలో ఉన్న నేతల సిస్టర్సేనా అని అనుకోవడం సహజం. కానీ నిజంగా కూడా వారిద్దరూ దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకులుగా పేరొందిన ముఖ్య నేతల సిస్టర్సే. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ నాయకుల సోదరిమణులు ఇద్దరూ కలుసుకున్న అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకీ వారెవరో తెలుసా..?
మోడీ.. యోగీ…
భారతీయ జనతా పార్టీలో దేశంలో శక్తివంతమైన నాయకులు అనగానే ఠక్కున గుర్తుకొచ్చిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దేశంలో బీజేపీ ట్రెండ్ సెట్టర్ లీడర్లుగా పేరు తెచ్చుకున్న ఈ నాయకుల కుటుంబాల నేపథ్యం కూడా చాల మందికి తెలిసిందే. చిన్న స్థాయి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతేనే చాలా మంది నాయకుల కుటుంబ సభ్యులు హాడావుడి చేస్తుంటారు. హంగు ఆర్భాటం, దర్పం ప్రదర్శిస్తూ తమ ప్రత్యేకతను చూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది మోడీ, యోగీల కుటుంబ సభ్యుల తీరు. సాధారణ పౌరుల వలే జీవనం సాగిస్తూ తమ కుటుంబాల బాగోగులు చూసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తారు. భయ్య నా ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చేందుకు నీ పలుకుబడి ఉపయోగించు అని కోరేందుకు కూడా మనస్కరించిన తీరును ప్రదర్శిస్తున్నాయి వీరి ప్యామిలీస్. ఎవరి జీవన విధానం వారిది అన్నట్టుగా కాలం వెల్లదీస్తున్నారే తప్ప మా సోదరుడు పీఎం అనో… మా సోదరుడు సీఎం అనో అహాన్ని కూడా ప్రదర్శించకుండా జీవిస్తున్న తీరు నేటి తరానికి చెందిన వారిలో చాలా మందికి ఆదర్శనీయమైన చెప్పాలి.
అపూర్వ కలయిక…
అయితే ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతిబెన్, సీఎం యోగి సోదరి శశిదేవీలు ఇద్దరు కలుసుకున్న అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఉత్తరఖండ్ లోని నీలకంఠ ధామ్ కు నరేంద్ర మోడీ సోదరి వాసంతి బెన్, ఆమె భర్త వెల్లారు. శ్రావణ మాసం సందర్భంగా దైవ దర్శనానికి వెల్లిన వాసంతి బెన్ కొఠారిలోని ఓ దేవాలయం సమీపంలో ఉత్తరప్రదేశ్ సీం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవి నడుపుతున్న షాపు వద్దకు వెల్లి కలిశారు. వీరిద్దరు కలుసుకుని అప్యాయతలు పంచుకున్న తరువాత శశిదేవి షాపులోని ఓ చెక్క బల్లపై కూర్చుని మాటమంతి చేసుకున్నారు. యోగ క్షేమాలు, కుటుంబం, పిల్లల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. పీఎం నరేంద్ర మోడీ సోదరి గుజరాత్ లోని విస్ నగర్ లో నివసిస్తున్నారు. ఆమె భర్త ఎల్ఐసీలో ఉద్యోగం చేసి రిటైర్ కావడంతో అక్కడే సాదా సీదా జీవనం సాగిస్తున్నారు.