అటు పీసీసీ చీఫ్ టూరు… ఇటు విబేధాల జోరు…

జోడో యాత్రా ఛోడో యాత్రా..?

ఓ వైపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర నడుస్తుంటే… మరో వైపున కాంగ్రెస్ నాయకులు ఛోడో యాత్రలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా ఏక తాటిపై నడిచేందుకు చొరవ చూపకుండా ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న విషయంలో అంతుచిక్కకుండా పోయింది. ఎమ్మెల్యేపై ఛార్జిషీట్ వేసేందుకు అంతా కలిసి ప్రెస్ మీట్ పెడితే ఆ తరువాత తమకేమీ పట్టనట్టుగా నాయకులు వెల్లిపోవడం ఏంటన్న చర్చ మొదలైంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పడేనా లేదా అన్న చర్చ సాగుతోంది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రను పురస్కరించుకుని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ఛార్జిషీట్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జి మేడిపల్లి సత్యం మొదట మాట్లాడారు. ఆ తరువాత చొప్పదండి నుండి టికెట్ ఆశిస్తున్న నాగి శేఖర్ మాట్లాడుతుండగానే మేడిపల్లి సత్యం ప్రెస్ మీట్ నుండి వెల్లిపోతుండడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రెస్ మీట్ పూర్తయ్యే వరకు అక్కడ ఉండకుండా సత్యం వెల్లిపోవడంపై ఆయన అసమ్మతీయులు నెట్టింట్ ట్రోల్ చేయడం ఆరంభించారు.

You cannot copy content of this page