‘గుంటూరు కారం’ ప్రేక్షకులకు పిరం…

దిశ దశ, హైదరాబాద్:

గుంటూరు మిర్చి ఘాటులాగానే తయారైంది ‘గుంటూరు కారం’ మూవీ. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వెండితెరపైకి ఎక్కనున్న ఈ చిత్రం చూడాలంటే అదనపు ఛార్జీలు చెల్లించుకోవల్సిందే. సగటు ప్రేక్షకుడి నుండి ముక్కు పిండి మరీ వసూలు చేసుకోవచ్చంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ మూవీ యూనిట్ కు స్వేచ్ఛను ఇచ్చేశాయి. ఒక్కో టికెట్ రూ. 50 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశాయి. దీంతో గుంటూరు కారం సినిమా టికెట్ కొనడం నుండే ప్రేక్షకుడికి ఘాటు తగలక తప్పని పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రొడ్రూసర్లు చేసిన అభ్యర్థనకు సానుకూలంగా వ్యవహరించిని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. సంక్రాతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సినిమా థియేటర్ల వైపు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి తయారైంది. ప్రభుత్వాలు కూడా ప్రేక్షకుల నుండి అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తే బావుండేది. రూ. కోట్లలో వెచ్చించి తీసే సినిమాల విషయంలో ప్రభుత్వాలు సానుభూతిని ప్రదర్శించి సగటు ప్రేక్షకుడిపై ఆర్థిక భారం వేయడం సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

You cannot copy content of this page