ఏపీ డీజీపీగా హరీష్ గుప్త…

దిశ దశ, ఏపీ బ్యూరో: 

ఏపీ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా హరీష్ గుప్తను నియమించాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఆదివారం ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలని ఆదేశించిన ఈసీఐ ముగ్గురు అధికారులతో కూడిన ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ఈ మేరుకు ఏపీ సీఎస్ ద్వారకా తిరుమల్ రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లను ప్రతిపాదించారు. వీరిలో హరీష్ గుప్తను సీఎస్ గా నియమించాలని, ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీ సీఎస్, డీజీపీలను మార్చాలని ఎన్నికల కమిషన్ కు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇద్దరు ‘‘గుప్త’’లే… 

తెలుగు రాష్ట్రాల పోలీసుల బాసులిద్దరు కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇద్దరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే బాధ్యతలు చేపట్టాల్సి రావడం మరో విశేషం. గత సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే డీజీపీ అంజనీ కుమార్, సీపీ సందీఫ్ శాండిల్యాలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. సంపూర్ణ మెజార్టీ వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని ఎలా కలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీఐ ఇద్దరు అధికారులపై వేటు వేసింది. అప్పుడు సీనియారిటీ జాబితా పంపించాలని ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎస్ ను ఆదేశించడంతో అందులో రవి గుప్త పేరును ఈసీఐ ఫైనల్ చేసింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న రవి గుప్తను యథావిధిగా కంటిన్యూ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయనే డీజీపీగా కొనసాగుతున్నారు. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసీఐకి ఫిర్యాదుల పరంపర కొనసాగింది. దీంతో రాజంద్ర నాథ్ రెడ్డిని డీజీపీ బాధ్యతల నుండి తప్పించిన ఎన్నికల కమిషన్ హరీష్ గుప్తను నియమించాలని ఆదేశించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు బాసులు గుప్తాలే కావడం విశేషం. 

You cannot copy content of this page