దిశ దశ, న్యూ ఢిల్లీ:
మణిపూర్ అంశంపై ప్రధాని మోడీచే సభలో మాట్లాడించాలని పంథంగా పెట్టుకున్న ఇండియా కూటమి పార్టీల లక్ష్యం నెరవెరినట్టే కనిపిస్తోంది. ప్రధాని మోడీ స్పందించాలన్న అంశంపై పట్టుబట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడంతో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి తమ పంథాన్ని నెగ్గించుకునే ఎత్తుగడను వేశాయి. దీంతో అవిశ్వాస తీర్మాణం విషయంలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. రాహుల్ స్పీచ్ తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ చర్చలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో గురువారం అధికార పక్ష సభ్యులు ప్రసగించనున్నారు. అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బండి సంజయ్, విజయ్ భగేల్, ఛటర్జీ, రాజ్ దీప్ రాయ్, రాజ వర్థన్ రాథోడ్ లు మాట్లడనున్నారు. అనంతరం ప్రధాని మోడీ కూడా సభలో ప్రసంగించేందుకు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటలలోపున ప్రధాని ప్రసగించనున్నారు. ప్రతిపక్ష పార్టీల వ్యూహంతో ప్రధాని మోడీ ప్రసగించక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post