ఆదిలోనే అడ్డుకుంటున్న తెలంగాణ ఫోర్స్…
దిశ దశ, దండకారణ్యం:
అభూజామఢ్ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దులపై కన్నేశారా..? దశాబ్దానికి పైగా దండకారణ్య అటవీ ప్రాంతానికే పరిమితం అయిన నక్సల్స్ ఇప్పుడు సరిహధ్దుల్లో సేఫ్టీ మేజర్స్ తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటీ..? చత్తీస్ గడ్ అడవుల్లో బలగాలు ఏం చేస్తున్నాయి..? ఉన్నట్టుండి తెలంగాణ బార్డర్ లో శత్రువును మట్టుబెట్టేందుకు సిద్దం కావడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..?
సరిహద్దుల వైపు…
మావోయిస్టులు తిరుగులేని పట్టు సాధించుకున్న బస్తర్ పూర్వ జిల్లాలో బలగాలను మట్టుబెడుతూ ముందుకు సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణాలోకి మావోయిస్టులు తిరిగి రాకుండా ఉండేందుకు సరిహద్దు జిల్లాల్లో పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఉత్తర తెలంగాణాలో గత వైభవాన్ని సంతరించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే తాజాగా సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల విధ్వంసాలకు పాల్పడేందుకు సమాయత్తం అవుతున్న తీరు సంచలనంగా మారింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. సరిహద్దులు దాటి నక్సల్స్ తెలంగాణాలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు సమన్వయంతో తెలంగాణ బలగాలు పనిచేస్తున్నాయి. అయితే ఇంతకాలం ఇటువైపు నిరాయుధులుగా మాత్రమే సంచరించిన నక్సల్స్ బలగాలే లక్ష్యంగా పెట్టుకుని వేస్తున్న వ్యూహాలు మావోయిస్టుల పయనం సాగుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లోని పుసగుప్ప అటవీ ప్రాంతంలో బూబీ ట్రాప్స్ ను భద్రాద్రి జిల్లా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే సరిహద్దు ప్రాంతంలో బూబి ట్రాప్స్ ను పోలీసులు గుర్తించి తొలగించారు. భూమిపై భారీ సైజు గోతులు తీసి అందులో పదునైన ఇనుప కడ్డీలను అమర్చి అటుగా వెల్లేవారికి అనుమానం రాకుండా మట్టి, ఆకులను పేరుస్తారు. కూంబింగ్ చేపట్టే బలగాలు అదమర్చి నడుచుకుంటూ వెల్లినట్టయితే బూబీ ట్రాప్స్ లో చిక్కుకునే అవకాశం ఉంటుందని, దీంతో బలగాల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని మావోయిస్టులు భావిస్తున్నట్టుగా ఉంది. మరో వైపున ములుగు జిల్లా సరిహధ్దుల్లోని తడపాల అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలు మందుపాతరలు పెడుతున్న వారిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక డిప్యూటీ కమాండర్, ఇద్దరు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి ఒక డీబీబీఎల్ తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకీటాకీలు, పేలుడు సామాగ్రి, ప్రెషర్ కుక్కర్లుతో పాటు ఎలక్ట్రిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో బూబీ ట్రాప్స్, మందుపాతరలను అమర్చడం వల్ల తెలంగాణా నుండి బలగాలు సరిహధ్దు అడవుల్లోకి పోలీసులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అర్థం అవుతోంది. అయితే వీటి ఉనికిని కనిపెట్టే విషయంలో తెలంగాణ బార్డర్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నక్సల్స్ ఎత్తులకు ఆదిలోనే చెక్ పడింది.
ఎందుకిలా..?
ఉన్నట్టుండి మావోయిస్టులు సరిహధ్దుల్లో స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అసలు ప్రశ్నగా మారోపోయింది. అయితే అభూజామఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యంలోకి చత్తీస్ గడ్ బలగాలు చొచ్చుకుపోతున్నాయి. మిలటరీ ప్లాటూన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న హిడ్మా స్వగ్రామమైన పువ్వర్తి, జీనాగూడ వంటి కీకారణ్యంలో కూడా కేంద్ర పారా మిలటరీ బలగాల క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. రోజు రోజుకు విస్తరిస్తున్న బలగాల చర్యలు వల్ల వందల సంఖ్యలో బెటాలియన్ల క్యాంపులు ఏర్పాటు అవుతున్న తీరు మావోయిస్టుల ఉనికికి సవాల్ విసురుతోంది. మరో వైపున అభూజామడ్ అడవులపై చత్తీస్ గడ్ నుండి ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలు పట్టు సాధించడం కూడా నక్సల్స్ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. ఇటీవల ఎన్ కౌంటర్లు కూడా సర్వ సాధారణంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో సాధారణంగా మారిపోగా… మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనే ఎక్కువ. చివరకు భూమిలో బంకర్లు ఏర్పాటు చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఎత్తులు వేస్తున్న విషయాన్ని కూడా చత్తీస్ గడ్ బలగాలు గుర్తించాయి. దీంతో అక్కడి అటవీ ప్రాంతంలో మనుగడ అసాధ్యమని మావోయిస్టు పార్టీ గమనించినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకునే క్రమంలో సరిహధ్దు అడవుల వైపు మావోయిస్టులు కన్నేసినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే సరిహధ్దుల్లో స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నన్నట్టుగా అనుమానిస్తున్నారు.
ముందు జాగ్రత్త…
అయితే కొత్త ఏరియాల్లోకి వెల్లి పట్టు నిలుపుకోవడంలో మావోయిస్టులకు కొంతకాలం సానుకూల వాతావరణం ఉంటుంది. పాత ఏరియాల్లోకి పునర్వైభవం సాధించడం మాత్రం అసాధ్యంగా మారింది. తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని ప్రయత్నించి పలు మార్లు విఫలం అయిన విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తుంచుకుంది. అయితే ఈ క్రమంలో సరిహద్దుల్లోనే సేఫ్ గా ఉండాలంటే తెలంగాణ దారులను మూసి వేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. రెండున్నర, మూడు దశాబ్దాల కాలం పాటు తెలంగాణ పోలీసులు పీపుల్స్ వార్ తో ప్రత్యక్ష్య పోరాటమే చేశారు. అప్పటి పీపుల్స్ వారే అయినా… ఇప్పటి మావోయిస్టులే అయినా వారి వ్యూహాలు ఏమిటీ..? వారి కదలికలు ఎలా ఉంటాయి..? అడవుల్లో కూంబింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నక్సల్స్ ఏరివేత విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి సంపూర్ణమైన అవగాహన తెలంగాణ పోలీసులకు ఉంది. దీంతో తెలంగాణలోకి ఎంటర్ కాకపోయినప్పటికీ సరిహధ్దు అడవులను అయినా సేఫ్ జోన్ గా మార్చుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాన వైపు నుండి వచ్చే బలగాలను కట్టడి చేసేందుకు ఇటు వైపు నుండి వెల్లే దారుల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ముందస్తు వ్యూహంలో భాగంగానే బూబీ ట్రాప్స్, మందుపాతరలను అమర్చుతున్నట్టుగా అర్థం అవుతోంది. జాయింట్ ఆపరేషన్ వంటి చర్యలతో తెలంగాణ పోలీసులు సరిహద్దు అడవుల్లోకి ఎంట్రీ ఇస్తే తమపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తెలంగాణ పోలీసులు పై చేయి సాధించే అవకాశం కూడా ఉంటుందన్న కారణంగా నక్సల్స్ ప్రమాదకరమైన బూబీ ట్రాప్స్, ల్యాండ్ మైన్స్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అటుగా వెల్లే తెలంగాణ పోలీసులు వీటిలో చిక్కుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. అయితే